హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వాహనాల రాకపోకలకు అనుమతి

కృష్ణా: నందివాడ మండలం పుట్టగుంట వంతెన వద్ద బుడమేరు ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో పుట్టగుంట వంతెన వద్ద వాహనాల రాకపోకలకు అధికారులు ఆదివారం అనుమతి ఇచ్చారు. రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన బుడమేరు నీటి ప్రవాహం ప్రస్తుతం తగ్గడంతో ద్విచక్ర వాహనాలు, కార్ల రాకపోకలను పునరుద్ధరించారు. అయితే బస్సులు, లారీలు, తదితర భారీ వాహనాలకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు.