హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులకు డిజిటల్‌ రికార్డుల నిర్వహణ

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్లపై శనివారం పోలీసు సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ మహంతి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కేసుల నమోదు, డిజిటల్‌ రికార్డుల నిర్వహణ, సైబర్‌ కేసుల వివరాల నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.