శ్రీకాకుళం పెద్దరెల్లివీధికి చెందిన షన్ముఖ (28) నాగావళి నదిలో గల్లంతయ్యాడు. శనివారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా యువతతో కలిసి నాగావళి వంతెన వద్దకు వెళ్లిన షన్ముఖ అకస్మాత్తుగా నదిలోకి దూకినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
నదిలో దూకి.. యువకుడు గల్లంతు


