ADB: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని వేద పండితులు విశాల్ శర్మ అన్నారు. ఆదివారం తాంసి మండలంలోని కప్పర్ల శ్రీ రామ మందిరంలో గణపతి మహా ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రామ మందిర అభివృద్ధికి గ్రామస్తులు దాతలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్ కుమార్, గండ్రత్ విలాస్, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
తెలంగాణ
VIDEO: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత: విశాల్ శర్మ


