WGL: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట రవి తల్లి పుట్ట రాజమ్మ మృతిచెందడంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సుబ్బయ్యపల్లిలోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాద సమయంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
తెలంగాణ
పుట్ట రాజమ్మ మృతికి ఎమ్మెల్యే నాగరాజు సంతాపం


