హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

KNR: మానకొండూర్ మండలం అన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బందెల మహేందర్ తల్లి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన కుటుంబాన్నిఆదివారం పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.