హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలి'

JGL: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో రాయికల్లో 'వోకల్ ఫర్ లోకల్' కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులు, కళాకారులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డా. తిరుపతి నాయక్, గంగాధర్ నాయక్, సుమన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.