హైదరాబాద్: 28°C
తెలంగాణ

విధుల్లో నిర్లక్ష్యం.. RI సరెండర్!

VKB: బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో RIగా విధులు నిర్వహిస్తున్న సుధ కలెక్టర్ కార్యాలాయనికి సరెండర్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం, పనుల్లో జాప్యం చేయడంతో పాటు విధుల్లో సమయపాలన పాటించడం లేదని ఆమెపై ఫిర్యాదులున్నాయి. కార్యాలయానికి వచ్చిన వారి వద్ద డబ్బులు తీసుకుంటున్నారని ఇటీవల కొందరు బహిరంగంగా విమర్శించారు. ఈమేరకు RIని సరెండర్ చేసినట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.