విశాఖ జూ ఆవరణంలో అర్ధరాత్రి సమయంలో జింకల గుంపు రోడ్డుపైకి వచ్చింది. వన్యప్రాణులు తరచూ రోడ్లపైకి వస్తుండటంతో వాటి రక్షణపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో పలు మూగజీవులు మృతి చెందాయని పేర్కొన్నారు. వన్యప్రాణులకు ప్రమాదాలు జరగకుండా అధికారులు స్పందించి, వాటి రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విశాఖలో రోడ్డుపైకి జింకల గుంపు


