హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ATP: గుత్తి మండలం బేతాపల్లికి గ్రామానికి చెందిన హరి ఆచారి అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భార్యను పుట్టింట్లో దించి బైక్‌పై గుత్తికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఐచర్ వాహనం ఢీకొని హరి ఆచారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఆదివారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.