హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

MLG: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఏపీవో టీవీఆర్ దామోదరస్వామి తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్, ప్రతిమ వైద్య కళాశాలల నిపుణులు సేవలందిస్తారు. పలు విభాగాల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు, మందుల పంపిణీ ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.