హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పంట నష్టంపై ఎన్యూమరేషన్‌

ఏలూరు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పలు పంటలు మునిగాయి. వాటి నష్టం అంచనా వేయడానికి ఎన్యూమరేషన్‌ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ సోమవారం నుంచి పొలం బాట పట్టనుంది. 375 రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బందిని సమన్వయం చేసుకుంటారు. అధికారులకు ఆన్‌లైన్‌లో వివరాలు పంపటానికి ట్యాబ్‌లు సమకూర్చుకునే పనిలో ఉన్నారు.