హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెరుగుతున్న గోదావరి ప్రవాహం

E.G: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుత నీటి మట్టం 40 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. కూనవరం వద్ద నీటిమట్టం 14.8 మీటర్లు, పోలవరం వద్ద 9.98 మీటర్లుగా ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 5.61 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కొనసాగుతుంది. 8-9 లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరే అవకాశం ఉందన్నారు.