హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 30న రెజ్లింగ్ పోటీలు, క్రీడాకారుల ఎంపిక

MDK: ఉమ్మడి మెదక్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య రెజ్లింగ్ పోటీలు, క్రీడాకారుల ఎంపికలను ఈనెల 30న సంగారెడ్డిలోని బీఆర్ అంబేద్కర్ మైదానంలో ప్రారంభించనున్నట్లు జిల్లా SGF కార్యదర్శి శ్రీనివాస్ రావు, రెజ్లింగ్ బాధ్యుడు విఠల్ నాయక్ నిన్న తెలిపారు. అండర్-14, అండర్-17 బాల బాలికల విభాగాల్లో ఎంపికలు ఉంటాయని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.