హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్హర్‌రావు SIR నోటీసులు వస్తే అధైర్యపడొద్దు

BHPL: మల్హర్‌రావు మండలంలోని ఓటర్లకు ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)కు సంబంధించి నోటీసులు అందుతున్న నేపథ్యంలో ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఎన్నికల సంఘం తాజాగా ఓటర్లకు వెసులుబాటు కల్పించిందని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైన పత్రాలను సేకరించేందుకు బూత్‌ స్థాయి అధికారులు (BLOలు) ఓటర్ల ఇళ్లకే వెళ్లే విధానం అమలు చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.