హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ పూజలు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వస్తివచనాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, ఈవో రమాదేవి, డీఈవో నవీన్ కుమార్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు.