హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్లలోకి దూసుకెళ్లిన బస్సు.!

BHNG: చౌటుప్పల్ మండలం బొర్రలగూడెం సమీపంలో జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఓ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న చెట్లలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.