హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చలో విజయవాడకు అనుమతి లేదు: ఎస్పీ

కర్నూలు: సచివాలయ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి అనుమతి లేదని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం తెలిపారు. వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాల్లో పాల్గొంటే శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. శాంతిభద్రతలకు సహకరించాలని ఎస్పీ కోరారు.