హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోడల్ స్కూల్లో విద్యార్థినికి కరెంట్ షాక్

అన్నమయ్య: నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లె మోడల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని రజిత (16) విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడింది. శనివారం కిటికీ పక్కన ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగినట్లు తండ్రి రవికుమార్ తెలిపారు. బాలిక కేకలు వేస్తున్నా పాఠశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించలేదని ఆయన ఆరోపించారు.