ASF: కెరమెరి మండలం కొత్తగూడకు చెందిన దుర్వ శ్రీనివాస్(40) పెద్దవాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. జోడేఘాట్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సీఆర్టీ పీడీగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఈ నెల 24న ఇంటికి వస్తుండగా భారీ వర్షాలతో ఉప్పొంగిన వాగులో గల్లంతయ్యారు. ఈ మేరకు అధికారులు, స్థానికులు గాలింపు చేపట్టగా నిసాని సమీపంలో మృతదేహం లభ్యమైంది.
తెలంగాణ
పెద్దవాగులో మృతదేహం లభ్యం


