హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి ఎయిమ్స్‌లో తొలిసారి లివర్ డయాలసిస్

పల్నాడు: మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు మరో ఘనత సాధించారు. నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో తొలిసారిగా విజయవంతంగా లివర్ డయాలసిస్ నిర్వహించారు. తీవ్రమైన హెపటైటిస్‌-ఎ, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న 22 ఏళ్ల యువకుడికి ఈ అత్యాధునిక చికిత్స అందించారు. డాక్టర్ ఉత్తరా దాస్ పర్యవేక్షణలో చికిత్స జరిగింది. దీంతో ఎయిమ్స్ క్రిటికల్ కేర్ సేవలు మరింత బలోపేతమయ్యాయి.