KKD: తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టడంతో పలివెల రాజా, కర్రి శివాజీ అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతులు చిన్ననాటి స్నేహితులు కావడంతో స్వగ్రామం కొత్తూరులో విషాదం నెలకొంది. చావులోనూ స్నేహం వీడలేదంటూ గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి


