WG: భారీ వర్షాలకు జిల్లాలోని 17 మండలాల్లో 5,049 ఎకరాలు ముంపునకు గురైనట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ముంపు నీటిని వెంటనే బయటకు పంపి పంట నష్టం నివారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. నీరు తగ్గిన వెంటనే పంట నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సలహాలు అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 5,049 ఎకరాల్లో పంట ముంపు: కలెక్టర్


