హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్య దూకిన చోటే భర్త ఆత్మహత్య

SKLM: ఏడాది కిందట భార్య దూకి చనిపోయిన చోటే భర్త దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం పట్టణం గుజరాతీపేట వేంకటేశ్వరనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ దువ్వు మోహనరావు శనివారం నదిలో దూకాడు. భార్య మృతి తర్వాత ప్రతిరోజూ కొత్త వంతెన వద్దకు వచ్చి అక్కడే గడిపేవాడని పోలీసులు తెలిపారు. రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.