VZM: మెరకముడిదాం మండలం బుధరాయవలసలో చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన తీవ్రంగా కలచివేసిందని మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వర్షాలు, వరదల సమయంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఐ శంకర్రావు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ముగ్గురు చిన్నారుల మృతి విషాదకరం'


