ELR: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉన్నందున ఎవరూ నది పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రదేశాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరికి పెరిగిన వరద ఉద్ధృతి: కలెక్టర్


