హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్‌ 2న గ్రామసభలు: ఎంపీడీవో

KMM: వీబీజీ రామ్‌జీ వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళికల తయారీకి కామేపల్లి మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో అక్టోబర్‌ 2న ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ధరావత్‌ సోంలాల్‌ తెలిపారు. సర్పంచుల అధ్యక్షతన జరిగే సభల్లో గుర్తించిన అన్ని పనులకు ఆమోదం తెలపనున్నట్లు పేర్కొన్నారు. గ్రామసభలను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.