హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: బొబ్బిలి డివిజన్ పారాది 33 కేవీ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల వల్ల ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నారు. దీనివల్ల మెట్టవలస, ఎన్‌ఏ వలస, పారాది ఫీడర్ల పరిధిలోని పారాది, మెట్టవలస, జీఎస్‌ఆర్‌పురం, నారాయప్పవలస, ఎం.పణుకువలస, గున్నతోటవలస గ్రామాల్లో సరఫరా ఉండదు. ప్రజలు సహకరించాలని ఈఈ బి.రఘు కోరారు