హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు శ్రావణి

HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌ మోడల్‌ కళాశాల ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఎల్తూరి శ్రావణి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. శనివారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్‌-17 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆమెను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపక బృందం అభినందించారు.