హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

30న జిల్లా సమీక్ష కమిటీ సమావేశం

ఏలూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ఈ నెల 30న ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పీ4, ప్రధానమంత్రి సూర్య ఘర్, రైతు సేవా కేంద్రాలు, తదితర అంశాలపై సమీక్షిస్తారన్నారు.