హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతల రహదారి.. ఇబ్బందుల్లో వాహనదారులు

SRPT: జిల్లా కేంద్రంలో ఆంజనాపురి కాలనీ నుంచి జనగాం రోడ్డుకు వెళ్లే రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. ఇక్కడి నుంచి గాంధీనగర్, బాషానాయక్ తండా, ఆర్వపల్లి, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, తదితర ప్రాంతాలకు నిత్యం వందల సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. గుంతల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కొంచెం దూరంలో నిలుపుకోవాల్సి వస్తోంది అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.