హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లి మందలించిందని విద్యార్థి ఆత్మహత్య

HNK: పరకాల మండలంలో తల్లి మందలించిందని ఓ 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హనుమకొండలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రెండు నెలలుగా కళాశాలకు వెళ్లడం లేదు. శనివారం కళాశాలకు వెళ్లాలని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.