హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే స్టేషన్ ఆవరణలో వ్యక్తి మృతి

JN: స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కాజీపేట జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌కు చెందిన ఇస్మాయిల్ (46) స్టేషన్‌లోని రెండో ప్రవేశ మార్గం వద్ద మృతదేహంగా కనిపించాడు. ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు.