హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కబ్జా కోరల్లో అల్లూరు రామన్న చెరువు...!

NLR: అల్లూరు మండలం సింగపేట గ్రామంలోని రామన్న చెరువులో కొందరు అక్రమ దారులు వందల ఎకరాల్లో అధికార పార్టీ నాయకుల అండదండలతో చెరువు మట్టిని త్రవ్వి కట్టలు ఏర్పాటు చేసుకొని చేపల గుంటలను నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందులో నిషేధిత ఫంగస్ చేపలను పెంచుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.