హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిచ్చికుక్క దాడిలో 8 మందికి గాయాలు

JN: లింగాలఘన్‌పూర్ మండలం సిరిపురంలో శనివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఎదురుపడిన వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది గాయపడగా, వారికి చికిత్స అందించారు. గ్రామంలో పిచ్చికుక్కల సంచారం పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పిచ్చికుక్కలను పట్టుకుని, కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు చేపట్టాలి.