హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెలుగు రాని అధికారులు.. గిరిజనుల గోడు వినేదెవరు?

ASR: తెలుగు మాట్లాడలేని ఐఏఎస్ అధికారుల వల్ల మన్యం ప్రజలకు ప్రయోజనం ఉండదని మన్యం ప్రజాగాయకుడు దుడ్డు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల సమస్యలు, కష్టాలు చెప్పుకునే ప్రధాన వేదిక పాడేరు ఐటీడీఏ అన్నారు. కానీ అక్కడి పీవోకు తెలుగు రాక, సమస్యలు చెప్పుకునే గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే ఐటీడీఏ పీవోను డీఆర్వోగా నియమించడం సరికాదన్నారు.