హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీట్‌లో కర్నూలు జిల్లా విద్యార్థి సత్తా!

కర్నూలు: పంచలింగాలకు చెందిన ఎం.జయదీప్‌ విశ్వాస్‌ 2026 నీట్‌ పీజీ పరీక్షలో జాతీయ స్థాయిలో 6,000వ ర్యాంకు సాధించారు. ఈయన విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో 2020-26లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఇంటర్‌ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివారు. ఆయన తండ్రి ఎం.జయాకర్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా, తల్లి ఎం.సంధ్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.