హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లెలో నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

KDP: వేంపల్లె దుర్గమ్మ దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు మాచిరెడ్డి రవికుమార్‌రెడ్డి తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా అర్చకులు విష్ణుశర్మ నేతృత్వంలో పందిరి పూజ నిర్వహించారు. గణపతి పూజ, భూమి పూజ అనంతరం శుభముహూర్తంలో పందిరి స్థంభ పూజ చేసి స్థంభస్థాపన చేశారు.