పల్నాడు: గణపవరం గ్రామానికి చెందిన నల్లూరి గౌతమి నెల్లూరు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. దామోదర సంజీవయ్య న్యాయ కళాశాల నుంచి 'లా' పూర్తి చేసిన ఆమె, మొదటి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. కుటుంబసభ్యుల సమక్షంలో ఆమె నెల్లూరు కోర్టులో బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు సివిల్ జడ్జిగా నల్లూరి గౌతమి బాధ్యతల స్వీకారం


