హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మార్కాపురాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం'

ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శనివారం రాత్రి పట్టణంలోని 13,14,15 వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల కోరిక మేరకు 15వ ఆర్థిక సంఘం, HAM నిధులతో పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. త్వరలో పనులు పూర్తి చేసి పట్టణంలోని ప్రతి రోడ్డును సీసీ రోడ్డుగా మార్చి మార్కాపురాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.