హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పట్టణంలోని పారిశుధ్యం అస్తవ్యస్తం'

పార్వతీపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్యం ఆధ్వానంగా మారింది. తుఫాన్ ప్రభావంతో నాలుగు రోజులుగా కురిసిన వర్షా లకు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తోడై స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పారిశుధ్య పనులు మందకొడిగా సాగుతుండడం తో ప్రధాన రహదారుల పక్కన చెత్త కుప్పలు ఆధ్వా నంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.