హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 29న ‘పారడైజ్’ సినిమా ప్రత్యేక షో

ASF: మాజీ సీఎం KCR అభిమానులు, తెలంగాణ అభిమానుల కోసం కాగజ్‌నగర్‌లోని వెంకటరమణ టాకీస్‌లో ఈనెల 29న ఉదయం 11 గంటలకు ‘పారడైజ్’ సినిమా ప్రత్యేక షో నిర్వహించనున్నట్లు మాజీ MLA కోనేరు కోనప్ప తెలిపారు. ప్రత్యేక షో కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా చిత్రం తెరకెక్కిందన్నారు.