హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీఎం సూర్యఘర్ లక్ష్యాలు ముఖ్యం: కలెక్టర్

W.G: పీఎం సూర్య ఘర్ పథకం అమలుపై భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సౌర విద్యుత్ ప్రయోజనాలను వివరిస్తూ, నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా సాధించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల ఈ పథకంలో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలోనే 4వ స్థానానికి చేరుకుందని ఎస్ఈ ఉషారాణి తెలిపారు.