హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లిని హత్య చేసిన కుమారుడి అరెస్టు

HNK: కాజీపేట బాలాజీనగర్‌లో తల్లిని హత్య చేసిన నాగుల దొరబాబును పోలీసులు అరెస్టు చేశారు. తల్లి ఉదయశ్రీ పరాయి వ్యక్తితో కలిసి వెళ్లేందుకు సిద్ధపడటాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఈ నెల 24న కత్తితో గొంతులో పొడిచి హత్య చేసినట్లు కాజీపేట సీఐ శ్యాంసుందర్ శనివారం తెలిపారు. రైల్వే ఆసుపత్రి ఆవరణలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.