హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నధర్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం

మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని చిన్నధర్‌పల్లి డివిజన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం రాత్రి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి శ్రీకరం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రతి డివిజన్‌కు నిధులు కేటాయించామని పేర్కొన్నారు.