హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాళ్లు కోల్పోయిన బాలుడికి చేయూత

కాకినాడ పోర్టు సమీపంలో జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన చిన్నారికి శనివారం చేయూత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో P4 కార్యక్రమం ద్వారా వీల్‌చైర్ అందించారు. స్థానిక ఎమ్మెల్యే కొండబాబు భరోసాతో ఈ సహాయం అందించగా, వీల్‌చైర్‌ను లంకా సాయిబాబు విరాళంగా అందించారు. చిన్నారి భవిష్యత్తుకు అండగా నిలిచిన దాతలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.