KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంటలో ఎరుకల రమేశ్‌కు చెందిన 23 పందులు చోరీకి గురయ్యాయి. ఈ నెల 23న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బొలెరో వాహనంలో వచ్చి పందులను అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటి విలువ సుమారు రూ.2.30 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మారుతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పందుల దొంగతనంపై కేసు నమోదు


