WG: సురక్షితమైన, సాంకేతికత ఆధారిత రవాణా సేవలు తణుకులో అందుబాటులోకి రావడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ర్యాపిడో సేవలను తణుకులో ఆయన శనివారం ప్రారంభించారు. స్థానిక ప్రజలకు సులభమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఈ సందర్బంగా సంస్థ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
సాంకేతిక ఆధారిత రవాణా సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే


