హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆస్పత్రిలో ఫోన్ల చోరీపై పోలీసుల నిఘా..!

WNP: మాతాశిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, వారి సహాయకుల చరవాణులు తరచూ చోరీకి గురవుతున్నాయి. ఒకే రోజు మూడు ఫోన్లు చోరీ కావడంతో బాధితులు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన పోలీసులు ఆస్పత్రిలో పనిచేసే స్వీపర్ వద్ద ఒక ఫోన్‌ను గుర్తించినట్లు సమాచారం. ఫోన్‌ను దొంగిలించారా, కొనుగోలు చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.