హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాల బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా తిరుపతి

JGL: జగిత్యాల పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా కాశెట్టి తిరుపతిని నియమించారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తిరుపతి తెలిపారు. పట్టణంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.